Kanta: రేజ్ ఆఫ్ కాంత .. లిరిక‌ల్ వీడియో

ABN , Publish Date - Oct 30 , 2025 | 07:46 PM

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్త నిర్మాణంలో రూపొందిన కాంత నుంచి కొత్త లిరికల్ వీడియో విడుదలైంది.

kanta

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన‌ పీరియడ్ రొమాంటిక్ డ్రామా ‘కాంత’ (Kanta) నుంచి తాజా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. దుల్కర్ నిర్మాణ సంస్థ వేఫెరర్ ఫిలిమ్స్ (Wayfarer Films) మరియు రానా దగ్గుబాటి (Rana Daggubati) ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, సముద్రఖని, గజరాజ్ రావ్, ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కి అద్భుత స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నవంబర్ 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్లను మేకర్స్ వేగవంతం చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన “మీ లోని ఫైర్” అనే లిరికల్ వీడియోకి జాను చంథర్ మ్యూజిక్ అందించగా, ఎనర్జీటిక్ బీట్‌లతో సాంగ్ యూత్‌ని ఆకట్టుకుంటోంది. The raging soundtrack that defines the range of Kanta అనే క్యాప్షన్‌తో రానా దగ్గుబాటి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సిద్దార్థ్ బ‌స్రూర్ (Siddharth Basrur) ఈ పాట‌ను ఆల‌పించ‌గా లునార్‌పంక్ ( Lunarpunk) సాహిత్యం అందించాడు. తెలుగు ర్యాప్‌ను అభిన‌వి క‌వి (AbhinavaKavi) ర‌చించి ఆల‌పించాడు.

1950ల నాటి సినిమా నేపథ్యంతో రూపొందుతున్న కాంతలో సినిమా సెట్లో నటుల మధ్య మొదలైన ప్రేమకథతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లామర్, రాజకీయాలు, భావోద్వేగాలు మిళితమై ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

దుల్కర్ సల్మాన్ గతంలో నటించిన కురుప్, చుప్, సీతా రామం వంటి సినిమాలతో విభిన్న పాత్రలు పోషించి విశేషమైన ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు కాంతతో మరో కొత్త జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - Oct 30 , 2025 | 07:51 PM