Pre Wedding Show : తిరువీర్ మూవీ నుండి క్యాచీ లవ్ సాంగ్

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:22 PM

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటిస్తున్న సినిమా 'ప్రీ వెడ్డింగ్ షో'. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ వీడియో విడుదలైంది. దీనిని సురేశ్‌ బొబ్బిలి స్వరపరిచారు.

Pre Wedding show

వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiruveer), టీనా శ్రావ్య (Teena Shravya) జంటగా నటిస్తున్న సినిమా 'ప్రీ వెడ్డింగ్ షో' (Pre Wedding Show). సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.


వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ అల్లు కున్న ప్రేమ కథ ఇది. అతనికి ఏర్పడే ఓ వింత సమస్య, దాన్నుంచి జెనరేట్ అయ్యే కామెడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక తాజాగా ‘ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ నుండి ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ ఈ పాటను పాడారు. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కె. సోమ శేఖర్, ఎడిటర్‌గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రజ్ఞయ్ కొణిగారి పని చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Also Read: Vijay: జీవితంలో ఎప్పుడూ ఇంత బాధ పడలేదు.. కరూర్ తొక్కిసలాటపై విజయ్ వీడియో సందేశం

Also Read: Allu Arjun: దీపిక పాత్ర తగ్గిపోయిందా...

Updated Date - Sep 30 , 2025 | 05:22 PM