Prabhas: ‘అర్జునుడి లాంటి రూపం.. శివుడి లాంటి బలం.. రాముడి లాంటి గుణం
ABN, Publish Date - Oct 23 , 2025 | 10:57 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. గురువారం అయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన స్పెషల్ మ్యాష్‌అప్ వీడియో ఆకట్టుకుంటోంది. ‘అర్జునుడి లాంటి రూపం.. శివుడి లాంటి బలం.. రాముడి లాంటి గుణం..’ అంటూ ప్రారంభమైన ఆ వీడియోలో ఆయన సినిమాలోని హైలైట్ డైలాగులు చూపించారు. . ఆ సన్నివేశాల్లో ఎలివేషన్స్ ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
Updated at - Oct 23 , 2025 | 11:02 AM