Draupathi 2: ‘నెల‌రాజె..’ అంటూ ప్రేమ గీతం వచ్చేసింది

ABN, Publish Date - Dec 01 , 2025 | 08:43 PM

రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. మోహన్. జి దర్శకుడు.  నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రూపొందుతున్న ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ద్రౌప‌ది పాత్ర‌లోని ర‌క్ష‌ణ చంద్ర‌చూడ‌న్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రీసెంట్‌గానే విడుద‌ల చేయ‌గా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సోమవారం  ‘నెల‌రాజె..’ అనే పాట‌ను విడుద‌ల చేశారు.  జిబ్రాన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలోని ఈ సాంగ్‌ను సామ్రాట్ రాయ‌గా ప‌ద్మ‌ల‌త పాడారు.  

Updated at - Dec 01 , 2025 | 08:43 PM