Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ టీజర్‌.. వినోదాత్మకం..

ABN, Publish Date - Sep 26 , 2025 | 12:24 PM

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రానికి నవీన్‌ పొలిశెట్టి రచయిత కావడం విశేషం. మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వినోదాత్మకంగా సాగిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.

Updated at - Sep 26 , 2025 | 12:24 PM