Yash Raj Films: సయారా నుండి వచ్చిన థర్డ్ సింగిల్...
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:39 PM
చిక్కీ పాండే తనయుడు ఆహాన్ పాండే 'సయారా' చిత్రంతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ విడుదలైంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) బ్యానర్ లో మోహిత్ సూరి (Mohith Suri) తెరకెక్కిస్తున్న సినిమా 'సయారా' (Saiyaara). ఈ ప్రేమకథ చిత్రంతో ఆహాన్ పాండే (Ahaan Panday) హీరోగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' సీరిస్ ఫేమ్ అనీత్ పద్దా (Aneet Padda) హీరోయిన్ గా నటిస్తోంది. అక్షయ్ విధాని నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోంది.
మోహిత్ సూరి రూపొందిస్తున్న 'సయారా' నుండి ఇప్పటికే ట్రైటిల్ ట్రాక్, దానితో పాటు జుబిన్ నౌటియాల్ పాడిన 'బర్బాద్' పాట విడుదలయ్యాయి. ఈ రెండు చాట్ బస్టర్స్ లో చోటు దక్కించుకున్నాయి. తాజాగా మూడో పాటగా విశాల్ మిశ్రా పాడిన 'తుమ్ హో తో' రిలీజ్ అయ్యింది. ఈ పెప్పీ లవ్ ట్రాక్ ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. ఈ పాట గురించి మోహిత్ సూరి మాట్లాడుతూ, ‘12 సంవత్సరాల క్రితం విశాల్ నన్ను కలవడానికి వచ్చినప్పటి నుండి నేను, తను కలిసి ఓ ప్రత్యేకమైన సినిమా కోసం పనిచేయాలని అనుకున్నాం. అయితే మేం సరైన క్షణం కోసం వేచి చూస్తున్నాం. చివరకు అది 'సయారా'తో నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పాటలే అతన్ని సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చాయని, అవే స్పూర్తి నింపాయని విశాల్ చెప్పడం ఎంతో ఆనందంగా అనిపించింది' అని అన్నారు.
ఇప్పటికే విడుదలైన 'సయారా' టీజక్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కాలాతీత ప్రేమకథలను సృష్టించడంలో పేరున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ, మోహిత్ సూరి ఈసారి మరో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని ఆడియెన్స్ కు అందించబోతున్నారని ఇప్పటికే విడుదలైన పాటలను చూస్తే అర్థమౌతోంది. 'సయారా' అంటే సంచరించే నక్షత్రం అని అర్థం. అది ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. ఎవరికీ అందరి ఆ నక్షత్రాన్ని కేవలం వర్ణించడానికే వినియోగిస్తారు. ఈ కథనుగుణంగానే ఆ టైటిల్ పెట్టామని మోహిత్ సూరి చెబుతున్నారు. మోహిత్ సూర్ గతంలో తెరకెక్కించిన 'ఆషికీ -2, మలంగ్, ఏక్ విలన్' వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందడంతో సహజంగానే 'సయారా' మీద కూడా అంచనాలు బాగానే పెరిగాయి.
Aslo Read: Samantha: నాగ చైతన్యను కలిసేదే లేదు.. క్లారిటీ ఇచ్చిన సామ్
Also Read: Gaddar Awards: సేవాకార్యక్రమాలకే వినియోగం...