Chiranjeevi - Nayanatara: ‘మీసాల పిల్ల’ ఫుల్ లిరికల్ వీడియో వచ్చేసింది

ABN, Publish Date - Oct 14 , 2025 | 04:35 PM

రెండు రోజుల నుంచి అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ‘మీసాల పిల్ల’ (Meesala Pilla) లిరికల్‌ వీడియో  వచ్చేసింది. చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. దసరాకు  విడుదలైన ఈ సాంగ్‌ ప్రోమో విపరీతంగా ప్రేక్షకుల్ని అలరించింది. ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ ఆలపించిన  ఫుల్ వీడియోలో చిరంజీవి స్టైలిష్‌ లుక్‌, ఆయన గ్రేస్‌, ఉదిత్‌ నారాయణ్‌ వాయిస్‌కు, భాస్కర్లభట్ల  సాహిత్యానికి  ప్రేక్షకులు  ఫిదా అవుతున్నారు.  ఈ పాటను మీరు చూసేయండి... 

Updated at - Oct 14 , 2025 | 04:53 PM