Tatha Song: హృద‌యాన్ని త‌డిమే.. తాత పాట‌

ABN , Publish Date - Oct 12 , 2025 | 09:28 PM

తాజాగా ఓ తెలుగు జాన‌ప‌ద పాట ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను బాగా త‌డుముతోంది.

Tatha Song

తాజాగా ఓ తెలుగు జాన‌ప‌ద పాట ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను బాగా త‌డుముతోంది. ఇటీవ‌ల మ‌నం త‌రుచూ చూస్తున్న‌, వింటున్న అమ్మాయిలు, బావ మ‌ర‌ద‌ళ్ల స‌ర‌సాలు, ఆట ప‌ట్టించే పాట‌ల మాదిరి కాకుండా అందుకు భిన్న‌మైన పాట ప్ర‌జ‌ల ఎదుట‌కు వ‌చ్చింది.

ఈ లోకాన్ని వ‌దిలిన తాత‌ను గుర్తు చేసుకుంటూ, ఆయ‌న జ్ఞ‌ప‌కాల‌ను త‌లుచుకుంటూ ఓ మ‌నుమ‌రాలు పాడే విషాద పాట అది. Tatha Full Song తాత ఓ సారి కాన‌రావే, తాత కండ్ల‌ల్ల ఉన్న‌వే అంటూ సాగే ఈ పాట ఆద్యంతం హృద‌యాల‌ను తాకేలా ఉన్న‌ది.

పాట మానుకోట ప్ర‌సాద్ (Manukota prasad) ఈ గీతానికి సాహిత్యం అందించ‌గా రిషిక (M. Rishika) అద్భుతంగా ఆల‌పించింది. నీర‌జ్ (Niraaj keys) సంగీతం అందించాడు. ముఖ్యంగా రిషిక పాట పాడిన విధానం చాలా అనుభ‌వం ఉన్న గాయ‌నిలా ఉండ‌డం విశేషం. ఛాన్సు అందివ‌స్తే భ‌విష్య‌త్తులో మంచి స్థానానికి వెళ్లే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మీరూ ఓ సారి వినండి.

Updated Date - Oct 12 , 2025 | 09:29 PM