Kuberaa: బిచ్చగాడి పాత్రకోసం ఇంతగా కష్టపడ్డాడా..
ABN, Publish Date - Jun 20 , 2025 | 06:26 PM
తమిళ నటుడు ధనుష్ , నాగార్జున రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది. ‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో జీవించే ఓ పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా శుక్రవారం సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. షూటింగ్ సమయంలో చిత్ర బృందం ఎలా కష్టపడ్డారు? బిచ్చగాడిలా కనిపించడానికి ధనుష్ సిద్ధమైన తీరును ఈ వీడియోలో చూపించారు. మీరు ఓ లుక్ వేయండి.
Updated at - Jun 20 , 2025 | 06:28 PM