Santoor Papa Song: ఏం పెట్టుకుంటవే.. సంతూరు స‌బ్బా! కొత్త ఫోక్ సాంగ్.. రాను బొంబాయికి రాను పాట‌ను బీట్ చేసేలా ఉందిగా!

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:42 PM

ఈ మ‌ధ్య రాను బొంబాయికి రాను, దారి పోంట‌త్తుండు అనే ఫోక్ సాంగ్స్ ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఓ ఊపు ఊపేసిన విష‌యం తెలిసిందే.

Santoor Papa Full Song

ఈ మ‌ధ్య రాను బొంబాయికి రాను (Ranu Bombayiki Ranu), దారి పోంట‌త్తుండు (Darii Pontattundu) అనే ఫోక్ సాంగ్స్ ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఓ ఊపు ఊపేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట‌లు సంచ‌ల‌న విజ‌యం సాధించడంతో ఇప్పుడువీటి త‌ర‌హాలోనే వ‌చ్చే ప‌ల్లె గీతాల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఇంచుమించు ఆ పాట‌ల లాగానే దూసుకెళ్ల గ‌లిగే స‌త్తా ఉన్నా ఓ పాట రిలీజ్ అయింది. ఏం పెట్టుకుంటవే సంతూరు స‌బ్బా.. నాకు మ‌స్తు న‌చ్చిన‌వే సంతూరు పాప (Santoor Papa Full Song) అంటూ సాగే ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో విడుద‌లైంది.

బుల్లెట్ బండి ల‌క్ష్మ‌ణ్ (Bullet Bandi Laxman) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా రాము రాథోడ్ (Ramu Rathod), కిరణ్మ‌యి ప్ర‌జాప‌త్ (Kiranmai Prajapath ) జంట‌పై చిత్రీక‌రించారు. వెంక‌ట్ సౌర్య (Venkat Sauryaa) నిర్మించిన ఈ వీడియో సాంగ్‌కు శేఖ‌ర్ వైర‌స్ (Shekar Virus) కొరియో గ్ర‌ఫీ చేశారు. నాగ‌వంశీ (Naga Vamshi ) సంగీతం అందించాడు. అయితే.. ఈ పాట ఓవైపు రికార్డు స్థాయిలో వ్యూస్ ద‌క్కించుకుంటూనే అంతే స్థాయిలో విమ‌ర్శ‌లు మూట గ‌ట్టుకుంటోంది. అందుకు కార‌ణం పాట‌ కాన్సెప్ట్ చాలా వ‌ర‌స్ట్‌గా ఉండ‌డ‌మే.

కొత్త‌గా పెళ్లైన యువ‌తి భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్ల‌గానే ఆమె వెన‌కాల‌ ఓ కుర్రాడు అదే ప‌నిగా వెంట‌ ప‌డుతూ పాడే పాట‌గా కాన్సెస్ట్ ఉండి తీవ్రంగా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కానీ పాట‌, ట్యూన్‌, అందులోని సాహిత్యం ప‌ల్లె, ప‌ట్ట‌ణ‌ జ‌నాల‌కు ఇట్టే క‌నెక్ట్ అయ్యేలా ఉండి విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. పాట విడుద‌లైన రెండు రోజుల్లోనే 3 మిలియ‌న్ల‌కు చేరువ‌యింది. చూస్తుంటే ఈ పాట మ‌రి కొన్ని రోజుల పాటు తెలుగు రాష్ట్రాల‌లో వైర‌ల్ అయ్యే అవ‌కాశం ఉండ‌గా రాను బొంబాయికి రాను పాట స‌ర‌స‌న కూడా చేర‌డం ప‌క్కా అని తెలుస్తోంది. మీరు ఇంత‌వ‌ర‌కు విన‌కుంటే ఇప్పుడే వినండి. మీ వంతు తిట్ల దండ‌కాన్ని కొన‌సాగించండి.

Updated Date - Aug 19 , 2025 | 07:42 PM