Kishkindhapuri: అద్భుతమైన విజువల్స్‌తో...

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:58 AM

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక....

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. షైన్‌ స్ర్కీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. తాజాగా, ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. సాయిశ్రీనివాస్‌ చెప్పిన ‘అహం మృత్యువు’ అనే డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Apr 30 , 2025 | 12:46 PM