K-Ramp: ఫస్ట్ సింగిల్ వచ్చేసింది...
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:18 PM
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ జంటగా నటిస్తున్న 'కె-ర్యాంప్' మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా 'కె- ర్యాంప్' (K-Ramp). ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా (Yukti Thareja) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ గా 'ఓనమ్' సాంగ్ విడుదలైంది. సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాయగా, ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేసి సాహితీ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj).