Kesari -2: అక్షయ్ కుమార్ చిత్రం నుండి ఉత్తేజభరిత గీతం

ABN, Publish Date - Apr 14 , 2025 | 10:52 AM

అక్షయ్ కుమార్, అనన్య పాండే, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కేసరి -2'. ఈ సినిమా నుండి తొలి గీతం విడుదలైంది.

Kesari -2: అక్షయ్ కుమార్ చిత్రం నుండి ఉత్తేజభరిత గీతం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) సినిమాలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఏదో విధంగా సమాజానికి కొత్త విషయాన్ని అందించే చిత్రాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులో కొన్ని విజయం సాధించవచ్చు, మరికొన్ని పరాజయాన్ని పొందొచ్చు. కానీ తన సంకల్పాన్ని మాత్రం సడలనీయడం లేదు అక్షయ్ కుమార్. ఆయన నటించిన 'కేసరి -2' (Kesari Chapter -2) చిత్రం ఏప్రిల్ 18న జనం మందుకు వస్తోంది. జలియన్ వాలా బాగ్ (Jallianwala bagh) దారుణ మారణకాండ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో న్యాయవాది శంకరన్ నాయర్ (Sankaran Nair) పాత్రను అక్షయ్ కుమార్ పోషించారు. ఆయన జూనియర్ గా అనన్య పాండే (Ananya Panday) నటించిన ఈ చిత్రంలో ఆర్. మాధవన్ (R Madhavan) ప్రత్యర్థి లాయర్ పాత్రను పోషించారు. కరణ్‌ జోహార్ (Karan johar) నిర్మించిన ఈ సినిమాలోని తొలి గీతం విడుదలైంది. 'ఓ షేరా తీర్ తే తాజ్' అంటూ సాంగే ఈ ఉత్తేజభరిత దేశభక్తి గీతం అందరినీ ఆకట్టుకుంటోంది. సంగ్తార్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు సుఖ్వీందర్ అమృత్ సాహిత్యాన్ని అందించారు. మన్మోహన్ వారిస్ దీనిని పాడారు. ఈ సినిమాను కరణ్‌ సింగ్ త్యాగి తెరకెక్కించారు.

Updated Date - Apr 14 , 2025 | 10:52 AM