Teliyadu Gurtuledu Marchipoya: హార్ట్ టచింగ్ గా 'నాన్న నీకు ప్రేమతో' పాట

ABN , Publish Date - Jul 18 , 2025 | 06:17 PM

నాన్న పేరుతో ఎన్ని పాటలు వచ్చినా ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు చాలా పాటలే వచ్చాయి. మరిన్ని వస్తాయి కూడా. అయితే అలాంటి ఓ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ సాంగ్ ఒకటి 'తెలియదు గుర్తులేదు మర్చిపోయా' చిత్రం నుండి వచ్చింది.

Teliyadu Gurtuledu Marchipoya Movie

నాన్న అంటేనే ఓ ఎమోషన్... ఎప్పటికి మార్చిపోలేని బంధం... తీర్చుకోలేని రుణం! అమ్మ తొమ్మిది నెలలు కడుపునా మోస్తే... తండ్రి గుండెల్లో పెట్టుకుని జీవితాంతం మోస్తాడు. బుడి బుడి అడుగులు వేసినప్పటి నుంచి... ప్రపంచాన్ని ఎలా గెలవాలో నేర్పించే మొదటి గురువు నాన్న. అంతేకాక మన సంతోషం కోసం తన జీవితాన్నే త్యాగం చేసే ఏకైక వ్యక్తి నాన్న. అలాంటి నాన్నపై ఎన్ని పాటలు వచ్చినా మనసుకు హత్తుకుంటాయి. తాజాగా 'తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా' మూవీ నుంచి వచ్చిన పాట మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకుంటోంది.


నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న 'తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా' (Teliyadu Gurtuledu Marchipoya) మూవీని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ (Chennai Creations Banner) పై శరత్‌ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ వీరవరపు ( Venkatesh Veravarapu) రూపొందిస్తున్నారు. తాజాగా 'నాన్న నీకు ప్రేమతో' (Nanna Neeku Prematho) అనే సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేయగా అది అలరిస్తోంది. తండ్రి -కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను చక్కగా చూపించారు ఈ పాటలో. 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ (Prudhvi Raj ) మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేయబోతున్నట్లు పాటను చూస్తే అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ (Ajay Patnaik) అందించిన ఈ పాట మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇక టైటిల్ లో గుర్తులేదు అన్న మాట ఉన్నా... ఈ మూవీ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఉంటుందని నిర్మాత శరత్ కుమార్ (Sarathkumar) తెలిపారు. ఈ మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచిన పృథ్వీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్ తో నిర్మిస్తున్న ఈ మూవీ విజయం సాధిస్తుందని... ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాటతోనే సినిమాపై హైప్ ను క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Read Also: Andhra King Taluka: నువ్వుంటే చాలే.. రామ్ రాసిన పాట విన్నారా

Read Also: Vijay Devarakonda: స్టంట్స్ చేసింది విజయ్ కాదా..

Updated Date - Jul 18 , 2025 | 06:22 PM