Bison Telugu Trailer: 'బైసన్' ట్రైలర్ రా అండ్ రస్టిక్

ABN, Publish Date - Oct 14 , 2025 | 04:26 PM

ధృవ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బైసన్'. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక.నీలం స్టూడియోస్, అప్లాజ్  ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో తెరకెక్కిన చిత్రమిది. అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ  సందర్భంగా హీరో  తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. 1990 బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట  కథాంశంతో వచ్చిన ఈ ట్రైలర్  రా అండ్ రస్టిక్‌గా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.  తమ గ్రామంలో ముందు కబడ్డీ పిచ్చి పుట్టాకే మనిషి పుడతాడు అని కాన్సెప్ట్ ను తెలియజేసేలా ఉంది ట్రైలర్. ఓ వైపు ఆట కోసం తను కన్న కల, మరోవైపు తీరని పగతో పాటు తండ్రీ కొడుకుల రిలేషన్ తో  సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. మీరు ఈ ట్రైలర్ చూసేయండి.   

Updated at - Oct 14 , 2025 | 04:26 PM