Yamudu Song: గూస్ బంప్స్‌ తెప్పించేలా ‘యముడు’ పాట

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:22 AM

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక.  శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు.  భవానీ రాకేష్ అందించిన బాణీ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా సాగిన ఈ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌ కానుంది.

Updated at - Jun 15 , 2025 | 10:22 AM