De De Pyaar De 2: వినోదాల విందు వడ్డిస్తున్న ట్రైలర్

ABN, Publish Date - Oct 14 , 2025 | 07:55 PM

ఈ యేడాది అజయ్ దేవ్ గన్ సీక్వెల్స్ సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. గత యేడాది రోహిత్ శెట్టి కాప్ డ్రామా 'సింగమ్ అగైన్' విడుదలైంది. ఇక ఈయేడాది 'రైడ్ -2', 'సన్ ఆఫ్‌ సర్దార్ -2' చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా 'దే దే ప్యార్ దే -2' రాబోతోంది. ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయబోతున్నారు మేకర్స్. దాంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ట్రైలర్ ను విడుదల చేశారు. 2019లో విడుదలై 'దే దే ప్యార్ దే' సినిమా ఎక్కడ ఆగిందో అక్కడి నుండే ఈ సీక్వెల్ మొదలు కాబోతున్నట్టు అర్థమౌతోంది. 50 సంవత్సరాల ఆషిష్, 26 సంవత్సరాల ఆయేషా తమ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏమిటన్నదే ఈ సీక్వెల్ కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. వినోదాల విందును పంచే ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి...

Updated at - Oct 14 , 2025 | 07:55 PM