Ajay Devgn: 'దే దే ప్యార్ దే -2' నుండి హార్ట్ బ్రేకింగ్ సాంగ్

ABN, Publish Date - Nov 11 , 2025 | 03:16 PM

అజయ్ దేవ్ గన్ (Ajay Devgn), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), మాధవన్ (Madhavan) ప్రధాన పాత్రలు పోషించిన 'దే దే ప్యార్ దే -2' మూవీ నుండి విరహగీతం 'ఆఖరి సలామ్' లిరికల్ వీడియో విడుదలైంది. సాగర్ భాటియా రాసి, స్వరపర్చిన ఈ పాటను అర్మాన్ మాలిక్ గొంతులో విషాదాన్ని నింపుకుని పాడాడు. మనస్పర్థల కారణంగా అజయ్ దేవ్ గన్, రకుల్ జంట విడిపోయిన సందర్భంలో వచ్చే ఈ పాట శ్రోతల గుండెల్ని పిండిచేసేలా ఉంది. ఆ మధ్య వచ్చిన డాన్స్ నంబర్ లో అందాల ఆరబోసి అదరగొట్టిన రకుల్ ఈ పాటలో విషాదయోగాన్ని పలికించింది. అన్షుల్ శర్మ దర్శకత్వంలో టి. సీరిస్ సంస్థ నిర్మించిన 'దే దే ప్యార్ దే -2' సినిమా నవంబర్ 14న జనం ముందుకు రాబోతోంది.

Updated at - Nov 11 , 2025 | 03:16 PM