Dacoit: డకాయిట్ ఫైర్ థీమ్ గ్లింప్స్.. గేట్లు ఎత్తేసినట్టే ఉంది 

ABN, Publish Date - Jun 03 , 2025 | 07:57 PM

అడివి శేష్ హీరోగా  తెరకెక్కుతున్న  పాన్-ఇండియన్ థ్రిల్లర్  'డకాయిట్.  ఇటీవల విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.  తాజాగా ఫైర్ థీమ్ ను టీం విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో ఫైర్ థీమ్ ని పవర్ ఫుల్ గా కంపోజ్ చేశారు.  ఆడియన్స్ కి  మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి  షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  క్రిస్మస్ కానుకగా , డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది.  

Updated at - Jun 03 , 2025 | 07:58 PM