Chennai Love Story: తొలిప్రేమ అంత తోపేమి కాదు.. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ చూశారా.. ?
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:02 PM
రాజావారు రాణిగారు (Rajavaaru Ranigaaru)అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్..
రాజావారు రాణిగారు (Rajavaaru Ranigaaru)అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. హిట్స్, ప్లాప్స్ పక్కనపెడితే.. కిరణ్ సినిమాల్లో కొత్తదనం లేదని ప్రేక్షకులు తేల్చి చెప్పేశారు. ఇక ఇప్పటివరకు తాను చేసిన తప్పేంటో తెలుసుకున్న కిరణ్ ఒక ఏడాది గ్యాప్ తీసుకొని.. లుక్, కథ అన్ని మార్చి క(KA) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
క సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కిరణ్ జోరు పెంచాడు. రొట్ట సినిమాలు కాకుండా ప్రేక్షకులను మెప్పించే కథలతో రావడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే దిల్ రుబా అంటూ వచ్చినా దాన్ని ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. అయినా కిరణ్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే K- ర్యాంప్ సినిమా సెట్స్ మీద ఉండగా.. కొత్తగా మరో సినిమాను ప్రకటించాడు. బేబీ (Baby)సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కథను అందిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక ఈ సినిమాకు చెన్నై లవ్ స్టోరీ( Chennai Love Story) అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ తెలిపారు. మ్యాడ్, లవర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌరీ ప్రియ(Gouri Priya) హీరోయిన్ గా నటిస్తుంది. ఒక అందమైన సముద్రపు ఒడ్డున కిరణ్, గౌరీ కూర్చొని తొలిప్రేమ గురించి మాట్లాడుకుంటున్నట్లు గ్లింప్స్ లో చూపించారు.
తొలిప్రేమ ఎంతో అద్భుతమైందని, దాని తరువాత వచ్చే ప్రేమలో నిజం ఉండదని హీరోయిన్ అంటే.. తొలిప్రేమ అంతే తోపేమి కాదని హీరో వివరణ ఇస్తాడు. తొలిప్రేమ గొప్పది అయితే.. ప్రతి ఒక్కరు అమ్మ ప్రేమ వద్దనే ఆగిపోతారని, దాని తరువాత వచ్చే ప్రేమ కూడా గొప్పదే అని చెప్పడంతో.. బ్రేకప్ అయిన హీరోయిన్ తో హీరో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కిరణ్, గౌరీ కెమిస్ట్రీ కొత్తగా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.
ఇక సినిమా మొత్తానికి ప్రాణం అంటే మణిశర్మ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఒక చిన్న గ్లింప్స్ తోనే మణిశర్మ మ్యూజిక్ తో మెల్ట్ చేసేశాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండకు హిట్ ఇచ్చిన సాయి రాజేష్.. చెన్నై లవ్ స్టోరీతో కిరణ్ అబ్బవరానికి కూడా హిట్ ఇస్తాడేమో చూడాలి.