Abid Bhushan: సస్పెన్స్ థ్రిల్లర్ గా మిస్టీరియస్

ABN , Publish Date - Jun 29 , 2025 | 05:36 PM

మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మిస్టీరియస్ నుండి సెకండ్ సింగిల్ విడుదలైంది. దీనికి ఎం.ఎల్. రాజా స్వరాలు సమకూర్చి సాహిత్యం అందించారు.

మహి కోమటిరెడ్డి (Mahi Komatireddy) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మిస్టీరియస్' (MissTerious). ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ప్రముఖ నటుడు నాగభూషణం (Nagabhushanam) మనవడు అబిద్ భూషణ్ (Abid Bhushan), బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని (Rohith Sahani), రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఉష, శివానీ సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై జయ్‌ వల్లందాస్ (యు.ఎస్.ఎ.) దీనిని నిర్మించారు. ఇప్పటికే విడుదల మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ కు చక్కని ఆదరణ లభించిందని, ఆ స్ఫూర్తితోనే తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశామని దర్శకుడు మహి కోమటిరెడ్డి తెలిపారు.

miss.jpg


ఈ సంద్భంగా మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ''మా మిస్టీరియస్ మూవీ నుండి సెకండ్ లిరికల్ వీడియో విడుదలైంది. దీనిని ప్రముఖ పంపిణీ దారులు, 'కుబేర' (Kubera) చిత్ర నిర్మాతలైన పూస్కర్ రామమోహన్ రావు, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ కుమార్ నారంగ్ చేతుల మీదుగా విడుదల చేయించాం. ఎం. ఎల్. రాజా సంగీత దర్శకత్వంలో ఈ పాటను కపిల్ కపిలన్, సమీరా భరద్వాజ్ పాడారు. దీనిని రాసింది కూడా మా సంగీత దర్శకులే. కన్నుల పండువగా అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించాం' అని చెప్పారు. ఇందులోని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉంటుందని, స్క్రీన్ ప్లే సైతం ఆకట్టుకునేలా సాగుతుందని మహి అన్నారు. ఈ మూవీలోని యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ, 'ఇందులో మూడు పాటలున్నాయని, అతి త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామ'ని చెప్పారు. ఈ సినిమాలో కన్నడ నటుడు బలరాజ్ వాడి తో పాటు ఆకునూరి గౌతమ్, భోగిరెడ్డి శ్రీనివాస్, జబర్దస్త్ రాజమౌళి, గడ్డం నవీన్, లక్ష్మీ, వేణు పోల్సాని ఇతర కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Jun 29 , 2025 | 05:41 PM