Bhairavam: మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన సాయి శ్రీనివాస్, అదితి శంకర్
ABN , Publish Date - May 23 , 2025 | 05:14 PM
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'భైరవం' సినిమా నుండి రొమాంటిక్ మాస్ సాంగ్ విడుదలైంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. భైరవం సినిమా ఈ నెల 30న జనం ముందుకు వస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా 'భైరవం' (Bhairavam). కె. కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల (Vijai Kanakamedala) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 30న మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఓ మాస్ బీట్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాయి శ్రీనివాస్, అదితి శంకర్, నృత్యతారలపై ఈ పాటను సెట్స్ లో చిత్రీకరించారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించగా, జానపద గీతాన్ని తలపించేలా దీనిని కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాటను ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల పాడారు. 'గిచ్చమాకా... గుచ్చమాకా' అంటూ అదితి శంకర్ హొయులు పోతుంటే.. ఆమెతో కలిసి సాయి శ్రీనివాస్ వేసిన మాస్ స్టెప్స్ కుర్రకారుని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి డాక్టర్ జయంతిలాల్ గాడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.