Comedian Praveen: బకాసుర రెస్టారెంట్ ట్రైలర్ విడుదల

ABN , Publish Date - May 17 , 2025 | 12:57 PM

కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'బకాసుర రెస్టారెంట్'. వైవా హర్ష టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మారుతీ ఆవిష్కరించారు.

కమెడియన్స్ హీరోలుగా మారడం తెలుగు సినిమా రంగంలో కొత్తేమీ కాదు. అయితే హీరోలుగా మారిన కమెడియన్స్ చాలామంది యూ టర్న్ తీసుకుని తిరిగి వినోదాల విందును అందించే పాత్రలే చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ ప్రవీణ్‌ (Praveen) సైతం 'బకాసుర రెస్టారెంట్' (Bakasura Restaurant) మూవీతో హీరోగా మారాడు. ఈ హారర్ కామెడీ చిత్రాన్ని లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మిస్తుండగా, ఎస్.జె. శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ టైటిల్ రోల్ ను వైవా హర్ష (Viva Harsha) చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్థమైన 'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్ ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి (Maruthi) ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు.


WhatsApp Image 2025-05-02 at 11.38.01 AM (1).jpegఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ''మారుతీ గారి చేతుల మీదుగా మా ట్రైలర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమకథా చిత్రమ్' నా కెరీర్‌ సెట్‌ కావడానికి ఎంతో ఉపయోగపడింది. ఈ రోజు ఆయన నా సినిమా ట్రైలర్‌కు రావడం ఆనందంగా ఉంది'' అన్నారు. మారుతి మాట్లాడుతూ '' ఈ సినిమాకు టైటిల్‌తోనే విజయం సాధించారు. మంచి టైటిల్‌ పెట్టారు. సినిమా కూడా బాగుంటుందనే నమ్మకం ఉంది. చాలా రోజుల నుంచి ప్రవీణ్‌ను హీరోగా చూడాలను కుంటున్నాను. ఈ రోజుకు కుదిరింది. డెఫినెట్‌గా ఈ సినిమా ప్రవీణ్‌ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది'' అని అన్నారు. దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ ''ఇలాంటి కథతో ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో బాగా డిజైన్‌ చేసుకున్నాం. మా టెక్నిషియన్స్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. తప్పకుండా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది'' అని చెప్పారు. వైవా హర్ష మాట్లాడుతూ ''ఈ సినిమా అందరికి బెంచ్‌ మార్క్‌ ఫిల్మ్‌ అవుతుంది. దర్శకుడు ఎంతో అనుభవం ఉన్న వాడిలా సినిమాను హ్యాండిల్‌ చేశాడు. కుటుంబంతో కలిసి అందరూ చూడదగ్గ చిత్రమిది. ప్రవీణ్‌ ఈ సినిమాతో హీరోగా మారినందుకు హ్యపీగా వుంది'' అని అన్నారు.

Also Read: Hari Hara Veera Mallu: రెట్టించిన ఉత్సాహంతో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 17 , 2025 | 01:10 PM