Tunnel Trailer: ఆసక్తికరంగా 'టన్నెల్' ట్రైలర్
ABN, Publish Date - Sep 04 , 2025 | 03:42 PM
అథర్వా మురళీ హీరోగా నటిస్తున్న క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 'యూనిఫామ్ వేసుకున్న తరువాత అందరూ ఫ్యామిలీనే' అని ట్రైలర్ లో ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్‌ను ఆధ్యంతం అలరించేలా ఉంది.
Updated at - Sep 04 , 2025 | 03:42 PM