Epic: శేఖర్‌ కమ్ముల హీరో.. సందీప్‌ రెడ్డి వంగా హీరోయిన్ ప్రేమకథ

ABN, Publish Date - Dec 01 , 2025 | 06:34 PM

ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda)- వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన ‘బేబీ’ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పడు ఈ కాంబోలో ‘#90s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. #90s వెబ్‌సిరీస్‌లోని పాత్రలతో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఎపిక్‌’ (Epic) అనే టైటిల్ ఖరారు చేశారు. సోమవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ఇది శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి, సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్‌ చెప్పిన డైలాగ్‌ అలరించేలా ఉంది. దీనిపై మీరు ఓ లుక్ వేయండి..

Updated at - Dec 01 , 2025 | 06:36 PM