45 The Movie: ‘45 ది మూవీ’ ఒకే పాటలో ముగ్గురు స్టార్లు 

ABN, Publish Date - Nov 03 , 2025 | 02:02 PM

కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి అగ్ర నటులతో అర్జున్ జన్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.  డిసెంబర్ 25న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం ఓ క్రేజీ సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘గెలుపు తలుపు దొరికే వరకు దిగులుపడుకురా’ అంటూ సాగే ఈ క్రేజీ సాంగ్‌కు రోల్ రైడా తెలుగులో సాహిత్యాన్ని అందించారు. రోల్ రైడా, వినాయక్ కలిసి ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్ క్రేజీ స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. ఇందులో ఆఫ్రికన్స్ వారితో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు అలరిస్తున్నాయి.  శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి క్రేజీగా కనిపిస్తున్నారు.   

Updated at - Nov 03 , 2025 | 02:02 PM