Shambala trailer: చెబుతున్న శాస్త్రం మితం.. తెలుసుకోవాల్సిన శాస్త్రం అనంతం
ABN, Publish Date - Nov 01 , 2025 | 12:45 PM
ఆది సాయి కుమార్ నటిస్తున్న చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్న భిమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’.. ‘వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞ అని నమ్ముతారు.. విక్రమ్ ఏమో చావులో సైతం సైన్స్ ఉందనే రకం’.. ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’ అనే డైలాగ్స్, ట్రైలర్‌లోని విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Updated at - Nov 01 , 2025 | 12:45 PM