Yogi Babu Debuts: తొలిసారిగా తెలుగులో

ABN , Publish Date - Jul 23 , 2025 | 02:57 AM

తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో ఇన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు కమెడియన్‌ యోగిబాబు. ఇప్పుడు ఆయన...

తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో ఇన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు కమెడియన్‌ యోగిబాబు. ఇప్పుడు ఆయన తొలిసారి ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రంలో యోగిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉడ్రాజు అనే పాత్రలో వినోదం పంచనున్నారు. మంగళవారం యోగిబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో వేణు సట్టి, అమర్‌ బురా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 23 , 2025 | 02:57 AM