Jagadeesh Aamanchi: అందరినీ ఆకట్టుకుంటుంది
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:41 AM
జగదీశ్ ఆమంచి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ దీని ట్యాగ్‌లైన్. శ్రావణి శెట్టి కథానాయిక...
జగదీశ్ ఆమంచి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ దీని ట్యాగ్‌లైన్. శ్రావణి శెట్టి కథానాయిక. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఈ మధ్య విడుదలవుతున్న చిన్న చిత్రాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ ‘యముడు’ చిత్రం కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. జగదీశ్ ఆమంచి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ అంశాలతోనే ఈ చిత్రాన్ని తీశాం. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు. కార్యక్రమంలో శ్రీమల్లిక, ఆకాశ్, భవానీ రాకేశ్ తదితరులు మాట్లాడారు.