Nandamuri Balakrishna: మార్కో డైరెక్టర్ తో జతకట్టిన బాలయ్య.. ?
ABN , Publish Date - Jun 07 , 2025 | 08:54 PM
అఖండ 2 తరువాత బాలయ్య.. గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
Nandamuri Balakrishna: అఖండ తరువాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).. కథలను ఆచితూచి ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం బాలయ్య చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్(Daaku Maharaj) సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ప్రస్తుతం అఖం 2(Akhanda 2) తో బిజీగా మారాడు. బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోకు ఇండస్ట్రీలో సపరేట్ బ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అందరూ అఖండ 2 కోసమే ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి జూన్ 7 న ఒక మాస్ అప్డేట్ ను అందివ్వనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు.
అఖండ 2 తరువాత బాలయ్య.. గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు జాట్(Jaat) సినిమా గోపీచంద్ మలినేని బాలయ్యను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడట. కానీ, అది చివరకు సన్నీ డియోల్ వద్దకు చేరింది. దీనికి మించిన కథను గోపిచంద్ .. బాలయ్య కోసం రెడీ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే నటసింహం మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
గతేడాది రిలీజైన సినిమాల్లో వైలెంట్ హిట్ గా నిలిచిన సినిమా మార్కో(Marco). మలయాళ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి హనీఫ్ అదేని(Haneef Adeni) దర్శకత్వం వహించాడు. మోస్ట్ వైలెంట్ సినిమాగా అన్ని భాషల్లో రిలీజ్ అయిన మార్కో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత హనీఫ్ అదేని.. బాలయ్య కోసం కథను సిద్ధం చేశాడని, ఆ కథ నచ్చడంతో దిల్ రాజు ఈ సినిమాను పట్టాలెక్కించి పనిలో ఉన్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్.
మార్కో సినిమాలో ఎంత వైలెన్స్ ఉందో అందరికీ తెల్సిందే. చిన్న పిల్లలు చూడకూడదు అని కూడా మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆ వైలెంట్ డైరెక్టర్.. బాలయ్యతో అంతకు మించి వైలెన్స్ ను సృష్టించబోతున్నాడట. అయితే ఈ సినిమాను మొదట మొదలుపెడతారా.. ? గోపీచంద్ మలినేని సినిమాను మొదలు పెడతారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే బాలయ్య అఖండ 2 ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కూడా ఆయనను సంప్రదించారని, ఇప్పటివరకు బాలయ్య నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది . మరి బాలయ్య ముందు ఏ సినిమాను ఓకే చేస్తాడో చూడాలి.