SSMB29: టైటిల్స్ చాలా ఉన్నాయి.. ఫైనల్ అయ్యేది ఏది

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:05 PM

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా మాత్రమే కాదు.. పాన్ వరల్డ్ అని చెప్పాలి.

SSMB29

SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా మాత్రమే కాదు.. పాన్ వరల్డ్ అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా వరకు మొదట పాన్ ఇండియా.. ఆ తరువాత పాన్ వరల్డ్ తీసుకెళ్లాడు. కానీ, SSMB29 తో గ్లోబల్ గా రీచ్ కావాలని చూస్తున్నాడు. దానికోసమే ఎంతో కష్టపడుతున్నాడు. నటీనటులతో పాటు టెక్నీషయన్స్ కూడా ఆచితూచి సెలెక్ట్ చేస్తున్నాడు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

టైటిల్ రివీల్ ఈవెంట్ నే జక్కన్న చాలా గ్రాండ్ గా చేస్తున్నాడు. నవంబర్ 15 న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశాడు. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశాడు. నిన్నటికి నిన్న ఎలాంటి చడీచప్పుడు లేకుండా సంచారి సాంగ్ ను రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ సాంగ్ వచ్చాకా అందరికీ కొత్త అనుమానం మొదలయ్యింది. SSMB 29 టైటిల్ సంచారి అయ్యి ఉంటుందా.. అందుకే ఆ సాంగ్ రిలీజ్ చేశారా అని డౌట్స్ మొదలయ్యాయి.

SSMB29 సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు ఆ టైటిల్ .. ఈ టైటిల్ అంటూ చాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. మొదట రుద్ర అన్నారు. ఆ తరువాత గరుడ.. ఈ మధ్య వారణాసి అని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు సంచారి అని కొత్త పేరు. ఇలా టైటిల్స్ సోషల్ మీడియాలో నానుతున్నాయి కానీ, ఫైనల్ అయ్యేది ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఈ పేరుల్లో ఫైనల్ అయ్యేంత స్థాయి దేనికైనా ఉందా.. ? జక్కన్న గ్లోబల్ గా ఎదగాలన్నప్పుడు ఇలాంటి పేర్లు పెడతాడా.. ? అని కొందరు చెప్పుకొస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం SSMB29 టైటిల్ ఇంగ్లిష్ లోనే ఉండబోతుందంట. అయితే అది అందరికీ తెల్సింది.. పలకడానికి వచ్చేదే అని టాక్. ,మరి రాజమౌళి స్థాయికి తగ్గట్లు ఆ టైటిల్ ఏంటో తెలియాలంటే ఇంకో నాలుగురోజులు ఆగాల్సిందే.

Updated Date - Nov 11 , 2025 | 06:10 PM