The Girl Friend: రిస్క్ తీసుకున్నాం.. రష్మికకు రెట్టింపు పారితోషికం ఇస్తాం
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:31 PM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ నెల 7న ఈ చిత్రం విడుదలవుతోంది.
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ నెల 7న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలిద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఇమిడే కథ కాదు. అయినా బాగా నచ్చడంతో రిస్క్ తీసుకున్నామని ధీరజ్ తెలిపారు.
‘ఈ సినిమా ప్రతి ఒక్కరి ప్రేమకథకు కనెక్ట్ అవుతుంది. రాహుల్ రవీంద్రన్ సినిమాను తెరకెక్కించిన తీరు సెన్సార్ సభ్యులకు నచ్చి, ‘నేషనల్ అవార్డ్ దక్కుతుంద’ని ప్రశంసించారు. ఈ సినిమాకు రష్మిక ఇప్పటివరకూ ఇంకా పారితోషికం తీసుకోలేదు. ఆమె మా పైన చూపిన ఔదార్యానికి గుర్తుగా రెట్టింపు పారితోషికం ఇస్తాం’ అని ధీరజ్ చెప్పారు.
కథకు కనెక్ట్ అయ్యాం
‘ది గర్ల్‌ఫ్రెండ్’ స్టోరీకి మేం బాగా కనెక్ట్ అయ్యాం అని విద్య కొప్పినీడి అన్నారు. ‘ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. ఇది మహిళా ప్రాధాన్య చిత్రం కాదు. కాలేజ్ బ్యాక్‌డ్రా్‌పలో సాగే నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రాసిన బలమైన ప్రేమకథ. ప్రేక్షకులకు తమకు తెలిసిన వారి ప్రేమకథలు గుర్తుకొచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే విజయం విషయంలో మేం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాం’ అని విద్య తెలిపారు.