Balakrishna: హిందీ వాళ్లకు.. మన దెబ్బేంటో చూపించాం! దెబ్బ‌కు దిమ్మ తిరిగిపోయింది

ABN , Publish Date - Nov 19 , 2025 | 06:51 AM

‘మన దెబ్బేంటో ముంబైలో హిందీ వాళ్లకు చూపించాం పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌ కాబోతోంది’ అని అన్నారు బాలకృష్ణ

Balakrishna

‘మన దెబ్బేంటో ముంబైలో హిందీ వాళ్లకు చూపించాం (టైటిల్‌ సాంగ్‌ని ముంబైలో విడుదల చేయడాన్ని ఉద్దేశించి). ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ‘అఖండ’ తొలి భాగం ఎంత హిట్‌ అయ్యిందో అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ (Akhanda 2 Tandavam) పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌ కాబోతోంది’ అని అన్నారు బాలకృష్ణ (Balakrishna).

ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ అచంట, గోపీ అచంట నిర్మించారు. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ సందర్భంగా వైజాగ్‌లో నిర్వహించిన వేడుకలో ఈ చిత్రం నుంచి ‘జాజికాయ..’ అంటూ సాగే గీతాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఇది కేవలం సినిమా కాదు. మన భారతీయ సనాతన హైందవ ధర్మం, శక్తి పరాక్రమాన్ని చాటి చెప్పే చిత్రం. మన భారతీయ మూలాలు ఏంటో తెలియజేసే సినిమా. అందుకే అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్‌ చేస్తున్నాం’ అని చెప్పారు.

చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘ఇది సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్‌ పాట. అనంతపూర్‌లో జరిగే పుట్టిన రోజు వేడుకలో వచ్చే పాట ఇది. సంయుక్త మేనన్‌ చేసిన తొలి మాస్‌ సాంగ్‌ ఇది. నాకు ఊపిరి ఉన్నంత వరకూ, బాలయ్య బాబుకు ఓపిక ఉన్నంత వరకూ మా ఇద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతూనే ఉంటుంది’ అని అన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 06:51 AM