Jr Ntr: వార్‌ 2.. ఎన్టీఆర్‌ పోస్ట్ వైరల్ 

ABN , Publish Date - Jul 07 , 2025 | 08:59 PM

హృతిక్‌ రోషన్‌తో కలిసి జూనియర్  ఎన్టీఆర్‌  నటించిన హిందీ సినిమా వార్‌ 2. ఎక్స్ వేదిక  ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)తో కలిసి జూనియర్  ఎన్టీఆర్‌  నటించిన హిందీ సినిమా ‘వార్‌ 2’ (War 2). అయాన్ ముఖర్జీ  దర్శకుడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ తారక్   ఎక్స్ వేదిక  ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

‘‘వార్‌ 2’ చిత్రీకరణ పూర్తయింది. హృతిక్‌ రోషన్‌ సర్‌ సెట్స్‌లో ఉన్నంత సేపూ సందడిగా ఉంటుంది. ఆయన ఎనర్జీకి ఆకర్షితుడినయ్యా. ఈ సినిమా  జర్నీలో  ఆయన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా ద్వారా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ  ఆడియన్స్ కి పెద్ద సర్‌ప్రైజ్‌ రెడీ చేశారు.  ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది. ఈ చిత్రానికి పని చేసిన ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌’ టీమ్‌కి కృతజ్ఞతలు. ఆగస్టు 14 సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 09:11 PM