Vrusshabha: 'వృషభ' తెలుగు రిలీజ్ ఎలా అంటే..

ABN , Publish Date - Dec 16 , 2025 | 07:26 PM

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ 'వృష‌భ' (Vrushabha) నందకిషోర్ (Nanda kishore) దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ  చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ 'వృష‌భ' (Vrushabha) నందకిషోర్ (Nanda kishore) దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ  చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25 ఈ సినిమా విడుదల కానుంది.  కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. స‌మ‌ర్జీత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Updated Date - Dec 16 , 2025 | 07:57 PM