Vision Studios: ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:48 PM

వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు.

Vision Studios icons of excellence awards: వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ (Vision Studios) 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. సినీ, విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్..ఇలా పలు రంగాల్లో ఈ అవార్డ్స్ అందించారు. విజన్ స్టూడియోస్ మొదటి సారిగా నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్నారు. 

Divya-vani.jpg

ఈ సందర్భంగా మంత్రి  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ  "రమేష్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. పట్టుదలతో కష్టపడే తత్వం కలవాడు. ఆయన విజన్ స్టూడియోస్ స్థాపించి 11 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఈ అవార్డ్స్ కార్యక్రమానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ ను బాలీవుడ్ సహా అన్ని సినిమాలకు కేంద్రంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు హైదరాబాద్ లో సినీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రిగా నేను ఆ బాధ్యత వహిస్తాను. విజన్ స్టూడియోస్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా"  అన్నారు.



విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ మాట్లాడుతూ "విజన్ స్టూడియోస్ నుంచి పదుల సంఖ్యలో సాంకేతిక నిపుణులు ఉపాధి పొందుతున్నారు. చిన్న చిత్రానికి విడుదల టైమ్ లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మా విజన్ స్టూడియో నుంచి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని దాదాపు వంద సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అందిస్తున్నాను. సినీ రంగంతో పాటు విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో మా అవార్డ్స్ ప్రతి సంవత్సరం అందిస్తాం అన్నారు. 

Vision.jpg
 
నటి దివ్యవాణి మాట్లాడుతూ - అవార్డ్స్ అనేవి కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఏపీలో నంది అవార్డ్స్, తెలంగాణలో రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. విజన్ స్టూడియోస్ కూడా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయం. నంది పురస్కారం, గద్దర్ అవార్డ్స్ లో అందరికీ పురస్కారాలు రావు. అలాంటి మరికొందరికి ఈ వేదిక ద్వారా గుర్తింపు దక్కడం సంతోషకరం" అన్నారు. 

Updated Date - Jun 23 , 2025 | 04:48 PM