Vishwak Sen: పెద్ది నెగిటివ్ టాక్.. తినే పళ్లెంలో ఉమ్మివేసే రకం వాడు
ABN , Publish Date - Dec 19 , 2025 | 08:00 PM
కుర్ర హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Vishwak Sen: కుర్ర హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల గురించి పక్కన పెడితే.. విశ్వక్ కు కొంచెం కోపం ఎక్కువ. దీనివలన ఎన్నోసార్లు ఈ హీరో వివాదాలపాలైన విషయం కూడా విదితమే. ముఖ్యంగా రివ్యూయర్లతో గొడవపడి.. రచ్చ కూడా చేశాడు. ఆ తరువాత అతని సినిమాలపై వచ్చే రివ్యూలను చూడడం మానేశాడో.. లేక పట్టించుకోవడం లేదో తెలియదు కానీ, మధ్యలో మాత్రం సైలెంట్ అయ్యాడు. ఇక తాజగా మరోసారి విశ్వక్.. రివ్యూయర్లపై మండిపడ్డాడు.
తాజాగా కొంతమంది రివ్యూయర్లు సినిమాల గురించి ఒక యాప్ లో మాట్లాడుకుంటున్నారు. అందులో పూలచొక్కా పేరుతో రివ్యూలు చెప్పే నవీన్ .. పెద్ది సినిమా గురించి నెగిటివ్ గా చెప్పడం మొదలుపెట్టాడు. పెద్ది స్టోరీ మీకు తెలుసా.. నాకు తెలుసు. కానీ, నేను చెప్పను.. మొన్నే నా మీద కేసు వేశారు అని చెప్పాడు. దానికి మిగతావాళ్ళు స్టోరీ వద్దు కానీ, సినిమా ఎలా ఉంటుందో మాత్రం చెప్పు అంటే.. ఏంటి ఈ స్టోరీతో ఇలాంటి సినిమా తీసావా.. మళ్లీ చికిరి గీకిరి అని పెట్టి' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక పూల చొక్కా నవీన్ చెప్పిన మాటలు విన్న కొంతమంది అదేంటి ఇలా చెప్పాడు. సినిమా బాలేదేమో అంటూ నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ వీడియోపై విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. అతను ఒక పరాన్నజీవి అని, సినిమాపైనే తింటూ.. అందులో ఉమ్మి వేసేరకం అంటూ మండిపడ్డాడు.
' అలాంటి వాడిని సినిమాకు పట్టిన పరాన్నజీవి అని పిలవడం సమంజసం కాదా? అతను ఈ పరిశ్రమ నుండి ప్రయోజనం పొందుతున్నాడు. దాని ద్వారా తనను, తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అయినా కూడా ఒక సినిమా విడుదల కాకముందే దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది తాను తినే పళ్లెంలోనే ఉమ్మినట్లు ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ పోస్ట్ వైరల్ గా మారింది. నెటిజన్స్ సైతం విశ్వక్ కు మద్దతు తెలుపుతున్నారు.