విష్ణు వంద శాతం న్యాయం చేశారు
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:45 AM
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్‌కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎం.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న...
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్‌కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎం.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముఖేశ్‌కుమార్ సింగ్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకొన్నారు.
కన్నప్ప కోసం ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం ఇలా.. అందరితో కలసి పనిచేయడం మరచిపోలేని అనుభూతి. ఈ వయసులోనూ మోహన్‌బాబు ఎంతో ప్యాషనేట్‌గా పనిచేశారు.
కన్నప్ప మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకొన్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. సినిమాలో చివరి గంట అద్భుతంగా ఉంటుంది.
మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియాలను సందర్శించారు. ఆయుధాలు, వస్త్రధారణ వంటి విషయాలపై చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం కాలంనాటి వాతావరణ పరిస్థితులను తెరపై చూపడానికి చాలా ప్రయత్నించాం. అందుకే సినిమాను న్యూజిల్యాండ్‌లో చిత్రీకరించాం.
ప్రభాస్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. అద్భుతంగా ఉందని వారు మెచ్చుకున్నారు.
కన్నప్ప అనేది మైథాలజీ కాదు. ఇది మన చరిత్ర. కన్నప్ప అనేవాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి