Vishals New Film: నూతన చిత్రం షురూ

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:49 AM

విశాల్‌ హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. ‘విశాల్‌ 35’ వర్కింగ్‌ టైటిల్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు...

విశాల్‌ హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. ‘విశాల్‌ 35’ వర్కింగ్‌ టైటిల్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. ఇది వారు నిర్మించే 99వ చిత్రం కావడం విశేషం. రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీర ధీర శూరన్‌’, ‘రాయన్‌’ ఫేమ్‌ దుషార విజయన్‌ కథానాయిక. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరోలు కార్తీ, జీవా, దర్శకులు వెట్రిమారన్‌, శరవణ సుబ్బయ్య తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఎన్‌బీ శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్‌.ఎం.నాథన్‌, సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్‌.

Updated Date - Jul 15 , 2025 | 05:49 AM