Visa Vintara Saradaga: అమెరికా చదువుల కథ
ABN , Publish Date - Jul 12 , 2025 | 02:00 AM
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్ధుల జీవితాలు, వారి కలలు, కష్టాలు, స్నేహాలను వివరించే కథాంశంతో రూపుదిద్దుకొంటున్న..
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్ధుల జీవితాలు, వారి కలలు, కష్టాలు, స్నేహాలను వివరించే కథాంశంతో రూపుదిద్దుకొంటున్న ‘విసా.. వింటారా.. సరదాగా’ చిత్రం ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. అశోక్ గల్లా, గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో ఉద్భవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విదేశాల్లో విద్యార్ధి జీవితాల్లోని ఎత్తు పల్లాలను ప్రతిబింబిస్తుందని దర్శకనిర్మాతలు తెలిపారు.