Karthik Varma Dandu: సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న విరూపాక్ష డైరెక్టర్
ABN , Publish Date - Jun 09 , 2025 | 07:37 PM
టాలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) ఎంగేజ్ మెంట్ ఎంతో సింపుల్ గా జరిగింది. జూన్ 8 న వధువు ఇంటివద్ద ఈ నిశ్చితార్ధ వేడుక చాలా కొద్దిమంది బంధువుల సమక్షంలో నిర్వహించారు.
Karthik Varma Dandu: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ.. ఒక్కొక్కరిగా ఒక ఇంటి వారవుతున్నారు. రెండు రోజుల క్రితమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ అక్కినేని(Akhil Akkineni) కూడా పెళ్లి పీటలు ఎక్కేశాడు. ఇక తాజాగా మరో డైరెక్టర్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) ఎంగేజ్ మెంట్ ఎంతో సింపుల్ గా జరిగింది. జూన్ 8 న వధువు ఇంటివద్ద ఈ నిశ్చితార్ధ వేడుక చాలా కొద్దిమంది బంధువుల సమక్షంలో నిర్వహించారు. అయితే వధువు ఎవరు.. ? ప్రేమ వివాహమా.. ? పెద్దలు కుదిర్చిన వివాహమా.. ? అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఈ నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతన్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.
భమ్ భోలేనాధ్ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ఎంట్రీ ఇచ్చాడు కార్తిక్ వర్మ దండు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక మధ్యలో చాలా గ్యాప్ తీసుకొని సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష(Virupaksha) సినిమాను తెరకెక్కించాడు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తేజ్ బేక్ యాక్సిడెంట్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా. అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
తేజ్ వద్దకు ఈ సినిమా రాకముందు కార్తీక్ ఎంతోమంది నిర్మాతలను ఈ కథ చెప్పాడట. కానీ, వారెవ్వరూ ఈ కథపపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రాలేదట. చివరకు తేజ్.. ఆ కథను నమ్మి తీసాయడంతో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తరువాత కార్తీక్ వర్మ దశ తిరిగింది. ప్రస్తుతం ఆయన.. నాగ చైతన్యతో కలిసి NC24 ను తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.