ఉత్కంఠ రేకెత్తించేలా
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:43 AM
అభిజ్ఞ పూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ఉత్కంఠ భరిత వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు...
అభిజ్ఞ పూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ఉత్కంఠ భరిత వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్ర్కీన్స్ బేనర్‌పై కేవీ శ్రీరామ్ నిర్మించారు. ఈనెల 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. విరాటపాలెం గ్రామానికి ఓ శాపం ఉంటుంది. ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా సరే మరుసటి రోజు పెళ్లి కూతురు చనిపోతుంది. అలా పదేళ్లుగా ఆ ఊరిని శాపం పట్టి పీడిస్తోందని ప్రజలు నమ్ముతుంటారు. అలాంటి ఊరికి లేడీ కానిస్టేబుల్ మీనా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే దాని చుట్టూ కథ సాగుతుంది. కథ 1980 కాలానికి చెందినదని ట్రైలర్‌ని చూస్తే అర్థమౌతుంది. చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్‌రాజు, సతీశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీ్‌సకు సంగీతం: రోహిత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: మహేశ్ కె.స్వరూప్.