Vimal Krishna: 'డీజే టిల్లు' దర్శకుడి మరో చిత్రం..
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:35 PM
'డీజే టిల్లు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు విమల్ కృష్ణ. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే!
'డీజే టిల్లు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు విమల్ కృష్ణ. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే! ఆ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిలకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఆయన ఓ చిత్రం డైరెక్ట్ చేయనున్నారు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్యా, చరిత్ర్ కీలక పాత్రధారులు.
సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. తొలి షాట్‌కు మేఘ చిలక, స్నేహ జగ్తియాని క్లాప్ కొట్టారు. సునీల్ నామా కెమెరా స్విఛ్చాన్ చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిదని తెలిపారు. ఈ సినిమాకు సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.