Vijay Sethupathi: పరాటా చేయడం నేర్చుకున్నా
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:25 AM
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా పాండిరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘సార్ మేడమ్’. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇటీవలె తమిళ్‌లో..
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా పాండిరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘సార్ మేడమ్’. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇటీవలె తమిళ్‌లో విడుదలైందీ చిత్రం. ఈ శుక్రవారం తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు తమిళ్‌లో మంచి విజయం దక్కింది. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకముంది. ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నాను. కథను నమ్మి చేసిన చిత్రమిది’’ అని అన్నారు. ‘‘ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరూ రిలేట్ చేసుకుంటారు’’ అని నిర్మాత త్యాగరాజన్ చెప్పారు. ‘‘ఇది ప్రేక్షకులకు మంచి హోమ్ ఫుడ్ లాంటి సినిమా’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. ‘‘భార్యాభర్తల మధ్య జరిగే అందమైన ప్రేమకథ ఈ చిత్రం’’ అని పాండిరాజ్ అన్నారు.