Puri Jagannadh: రెగ్యులర్ షూటింగ్ షురూ
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:30 AM
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇటీవలె ప్రారంభమైన సంగతి తెలిసిందే..
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇటీవలె ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు మేకర్స్. విజయ్ సేతుపతి, సంయుక్తతో పాటు ప్రధాన పాత్రధారులు ఇందులో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్‌ను నిర్మించి సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విజయ్‌కుమార్, సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఛార్మీ కౌర్ సమర్పణలో పూరిజగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది.