Premisthunna Movie: ప్రేమ గీతం
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:13 AM
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ప్రేమ కథా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. భాను దర్శకత్వంలో పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్నారు. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా...
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ప్రేమ కథా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. భాను దర్శకత్వంలో పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్నారు. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఎవరే నువ్వు’ అంటూ సాగే గీతాన్ని నటుడు విజయ్‌సేతుపతి విడుదల చేసి, సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ ‘‘ప్రేమిస్తున్నా’ కథ చాలా బావుందని విజయ్ సేతుపతి గారు మెచ్చుకున్నారు. ఇదొక కొత్త తరహా ప్రేమకథా చిత్రం. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే సున్నితమైన ప్రేమకథా చిత్రం ఇది. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది’’ అని చెప్పారు.