Premistunnaa: విజయ్ సేతుపతి చేతుల మీదుగా.. ఎవరే నువ్వు సాంగ్ విడుదల
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:11 PM
సాత్విక్ వర్మ (Sathvik Varma), ప్రీతి నేహా (Preethi Neha) హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమిస్తున్నా
సాత్విక్ వర్మ (Sathvik Varma), ప్రీతి నేహా (Preethi Neha) హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమిస్తున్నా. భాను దర్శకత్వంలో లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ బ్యానర్‌పై కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నాడు. అయితే.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అరెరె కు మంచి రెస్పాన్స్ లభించింది, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకాధారణ లభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్ "ఎవరే నువ్వు" ను హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ పాటను పూర్ణ చంద్ర రచించగా సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ... మా ప్రేమిస్తున్నా సినిమా సెకండ్ సాంగ్ ఎవరే నువ్వు ను హీరో విజయ్ సేతుపతి గారు విడుదల చెయ్యడం ఆనందంగా ఉందని, మా సినిమా కథ కథనాలు ఆయన తెలుసుకునిగారు తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చెశారన్నారు. కాగా ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు.