Spy Action Thriller: సామ్రాజ్య టైటిల్‌తో

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:17 AM

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే...

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. శనివారం చిత్రబృందం హిందీ టైటిల్‌ను ప్రకటించింది. అక్కడ ఈ చిత్రాన్ని ‘సామ్రాజ్య’ పేరుతో హిందీలో విడుదల చేస్తున్నారు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సంగీతం: అనిరుధ్‌

Updated Date - Jul 20 , 2025 | 04:17 AM