Vijay Deverakonda: ఏపీలో కింగ్‌డమ్‌ టికెట్ల ధర పెంపు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:34 AM

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు...

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ధరల పెంపు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఇటీవలె మేకర్స్‌ విజ్ఞప్తి చేసుకున్నారు. గురువారం టికెట్ల ధరను పెంచుకోవడానికి చిత్రబృందానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి పదిరోజుల పాటు సింగిల్‌ స్ర్కీన్స్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్సుల్లో రూ.75 పెంచుకునే వెసులుబాటును కల్పించింది. సినిమా విడుదలకు ముందురోజు రాత్రి ప్రీమియర్‌ షోలను ప్రదర్శించడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jul 25 , 2025 | 01:34 AM