Kingdom: అనుకున్నంత‌యింది.. కింగ్ డమ్ రిలీజ్‌ వాయిదా...

ABN, Publish Date - May 14 , 2025 | 11:53 AM

అనుకున్నంత‌యింది ది ఫ్యామిలీ స్టార్ చిత్రం త‌ర్వాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కింగ్‌డమ్ చిత్రం రిలీజ్‌వాయిదా ప‌డింది!

vijay

ది ఫ్యామిలీ స్టార్ చిత్రం త‌ర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కింగ్‌డమ్ (KINGDOM). భాగ్యశ్రీ బోర్సే క‌థానాయిక కాగా అన‌రుధ్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విష‌యంలో గ‌త ప‌ది ప‌ది హేను రోజులుగా వినిపిస్తున్న‌ వార్త‌లు నిజ‌మేమ‌ని తాజాగా మేక‌ర్స్ తీసుకున్న నిర్ణ‌యంతో తెలుస్తోంది. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం, జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సంద‌ర్భంగా వారు సోష‌ళ్ మీడియా వేదిక‌గా ఓ లెట‌ర్ రిలీజ్ చేశారు.. "మా ప్రియమైన ప్రేక్షకులకు.. మే 30న విడుదల కావాల్సిన మా 'కింగ్‌డమ్‌' సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్‌లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.


ఈ నిర్ణయం 'కింగ్‌డమ్ సినిమాకు మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చినా 'కింగ్‌డమ్‌' చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంద‌ని, జూలై 4న థియేటర్లలోకి వ‌చ్చాక ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నామన్నారు., అదేవిధంగా విడుదల తేదీ మార్పు విషయంలో తమ మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, నితిన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము." అని చిత్ర బృందం పేర్కొంది.

అయితే.. గ‌త కొంత కాలంగా యుద్ద వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో సినిమా విడుద‌ల పోస్ట్‌పోన్ చేయాల‌నే ఆలోచ‌న‌లో నిర్మాత‌లు మొద‌ట వార్త‌లు వినిపంచాయి. అదే స‌మ‌యంలో అప్ప‌టివ‌ర‌కు చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఉన్న‌ బెల్లంకొండ శ్రీనివాస్ భైర‌వం సినిమాను మూడు రోజుల క్రితం స‌డ‌న్‌గా మే 30న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో కింగ్డ‌మ్ సినిమా రిలీజ్ ప‌డుతుంద‌ని అందుకే ఈ సినిమా రిలీజ్‌కు వ‌స్తుంద‌ని న్యూస్ వైర‌ల్ అయింది. ఇప్పుడు కింగ్డ‌మ్ మూవీ మేక‌ర్స్ సినిమాను 50 రోజుల త‌ర్వాత విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి విజ‌య్ అభిమానుల‌కు, సినీ ల‌వ‌ర్స్ అనుమానాల‌కు తెరదించారు. అయితే విజ‌య్ అబిమానులు మాత్రం కాస్త ఫైర్ అవుతున్నారు.

Updated Date - May 14 , 2025 | 02:57 PM